Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ చీఫ్ అండర్‌వేర్‌ను దొంగిలించిన అమెరికా బలగాలు

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:29 IST)
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) అధినేత అబుబాకర్ అల్ బ‌గ్దాదీని అమెరికా భద్రతా బలగాలు హతమార్చాయి. అతన్ని గుర్తించేందుకు ముందుగా ఆయన అండర్‌వేర్‌ను దొంగిలించారు. ఆ తర్వాత దానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. ఆ పిమ్మటే బగ్దాదీని హతమార్చేందుకు అమెరికా బలగాలు ఓ ఆపరేషన్ చేట్టాయి. ఈ ఆపరేషన్ పక్బందీగా సాగడంతో బాగ్దాదీ హతమయ్యాడు. 
 
అయితే, బాగ్దాదీ ఆచూకీ తెలుసుకునేందుకు అమెరికా నిఘా వర్గాలకు సిరియా డెమోక్ర‌టిక్ ద‌ళాలు (ఎస్.డి.ఎఫ్) స‌హ‌క‌రించాయి. బ‌గ్దాదీ క‌ద‌లిక‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ ఎస్‌డీఎఫ్ నిఘా పెట్టింది. ఓ ద‌శ‌లో బ‌గ్దాదీ అండ‌ర్‌వేర్‌ను కూడా దొంగ‌లించారు. అండ‌ర్ క‌వ‌ర్ పోలీసులు బ‌గ్దాదీ ధ‌రించిన లోదుస్తుల‌ను సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. 
 
ఆ అండ‌ర్‌వేర్‌పై డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాతే.. అమెరికా ద‌ళాలు బ‌గ్దాదీని చంపేందుకు ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. సిరియ‌న్ డెమోక్ర‌టిక్ ద‌ళానికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. బ‌గ్దాదీ అండ‌ర్‌వేర్‌కు డీఎన్ఏ ప‌రీక్ష‌లు జరిపిన త‌ర్వాత వంద శాతం నిర్ధార‌ణ‌కు వ‌చ్చామ‌న్నారు. 
 
అల్ బ‌గ్దాదీ మృత‌దేహానికి అమెరికా ద‌ళాలు ఇస్లామిక్ సాంప్ర‌దాయం ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాయి. ముక్క‌లైన బ‌గ్దాదీ శ‌రీర భాగాల‌ను స‌ముద్రంలో క‌లిపారు. ఇస్లామిక్ సాంప్ర‌దాయం ప్ర‌కార‌మే తంతు సాగిన‌ట్లు అమెరికా అధికారులు ఓ వార్తా సంస్థ‌కు చెప్పారు. 2011లో పాకిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన త‌ర్వాత చేప‌ట్టిన క్ర‌తువును ఇప్పుడూ నిర్వ‌హించిన‌ట్లు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments