Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్‌లో నాగుపాము.. హడలిపోయిన టూరిస్టులు..

నైనిటాల్‌లోని క్లాసిక్ హోటల్‌లో ఓ నాగుపాము పర్యాటకులను హడలెత్తింపజేసిది. పర్యాటక ప్రాంతమైన నైనిటాల్‌ అందాలను వీక్షించేందుకు 40 మంది పర్యాటకులు క్లాసిక్ హోటల్‌లో బస చేసేందుకు దిగారు. ఆ సమయంలో ఓ పెద్ద న

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (16:18 IST)
నైనిటాల్‌లోని క్లాసిక్ హోటల్‌లో ఓ నాగుపాము పర్యాటకులను హడలెత్తింపజేసిది. పర్యాటక ప్రాంతమైన నైనిటాల్‌ అందాలను వీక్షించేందుకు 40 మంది పర్యాటకులు క్లాసిక్ హోటల్‌లో బస చేసేందుకు దిగారు. ఆ సమయంలో ఓ పెద్ద నాగుపాము హోటల్‌లో ప్రవేశించడాన్ని ఓ టూరిస్టు చూశాడు. దీంతో హోటల్‌లో కలకలం రేగింది. కానీ ఆ పాము ఎక్కడికెళ్లిందో తెలియకపోవడంతో 40 మంది టూరిస్టులు రాత్రంతా జాగారం చేశారు. 
 
హోటల్ సిబ్బంది అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. రాత్రంతా పాముకోసం వెతికిన అటవీ సిబ్బందికి  తెల్లవారుజామున హోటల్ రిసెప్షన్‌లోని పూలకుండీలో పాగా వేసిన 14 అడుగుల నాగుపాము కనిపించింది. 
 
దానిని అటవీశాఖ సిబ్బంది పట్టుకెళ్లిపోవడంతో హోటల్ సిబ్బంది, పర్యాటకులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ పాము అత్యంత విషపూరితమైందని.. అటవీశాఖ సిబ్బంది వెల్లడించారు. పాము భయంతో రాత్రంతా ఆ హోటల్‌లో బస చేసిన పర్యాటకులు జాగారం చేశారని హోటల్ సిబ్బంది వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments