Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షిపణి ప్రయోగం సక్సెస్.. భార్యతో కిమ్ జాంగ్.. ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ వున్‌ సాధారణంగా తన భార్య రి సోల్ జుతో కలిసి మీడియా కంటపడరు. అయితే ఖండాంతర ప్రయోగం విజయవంతం కావడంతో నిర్వహించిన సంబరాలకు కిమ్ జాంగ్ ఉన్ తన భార్యతో పాటు హాజరయ్యారు. వాస్త

Webdunia
గురువారం, 13 జులై 2017 (12:14 IST)
ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ వున్‌ సాధారణంగా తన భార్య రి సోల్ జుతో కలిసి మీడియా కంటపడరు. అయితే ఖండాంతర ప్రయోగం విజయవంతం కావడంతో నిర్వహించిన సంబరాలకు కిమ్ జాంగ్ ఉన్ తన భార్యతో పాటు హాజరయ్యారు. వాస్తవానికి కిమ్‌ తండ్రి, తాతలు అధ్యక్షులుగా ఉన్న సమయంలో వారి సతీమణులు అసలు బయటకు కనిపించేవారు కాదు. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కన బెట్టి కిమ్‌ తన భార్యను అప్పుడప్పుడు మీడియా ముందుకు తీసుకొస్తుంటారు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత భార్యతో కలిసి కిమ్ సందడి చేశారు. 
 
గతంలో రెండు మూడు సార్లు కనిపించిన కిమ్ సతీమణి.. ఆపై కనిపించలేదు. దీంతో రి సోల్ గర్భవతి అయివుంటారని అందుకే ఆమెను బయటకు కనిపించనీయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అంతే కాకుండా కిమ్‌కు తన భార్యతో విభేదాలు వచ్చాయని, అతని నుంచి ఆమె విడిపోయారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు చెక్ పెట్టేలా కిమ్ తన భార్యతో క్షిపణి విజయవంతం సంబరాల్లో కనిపించారు. దీంతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం