Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరస్పర నిందలు వద్దు.. చర్చించుకుందాం రండి... భారత్‌కు ఇమ్రాన్ పిలుపు

పరస్పర నిందలతో ఒరిగేదేమీ లేదనీ, అందువల్ల కాశ్మీర్ వంటి అత్యంత కీలకమైన అంశాలపై చర్చించుకుందాం రండి అంటూ భారత పాలకులకు పాకిస్థాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ పిలుపునిచ్చారు.

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (10:27 IST)
పరస్పర నిందలతో ఒరిగేదేమీ లేదనీ, అందువల్ల కాశ్మీర్ వంటి అత్యంత కీలకమైన అంశాలపై చర్చించుకుందాం రండి అంటూ భారత పాలకులకు పాకిస్థాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ పిలుపునిచ్చారు.
 
తాజాగా జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ 120 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ ఖాన్ సై అంటున్నారు. అదేసమయంలో ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 
 
శాంతిదిశగా భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే, మేం రెండడుగులు ముందుకు రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. "నాకు వ్యక్తిగతంగా భారత్‌లో చాలామంది తెలుసు. క్రికెట్ కారణంగానే ఆ పరిచయాలు నాకు దక్కాయి. ఇరుదేశాల మధ్య కాశ్మీర్ ప్రధాన సమస్య. చర్చల ద్వారా మాత్రమే ఇరుపక్షాలు దానికి పరిష్కారం కనుగొనగలవు" అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. 
 
'కాశ్మీర్‌పై పాకిస్థాన్, బలూచిస్తాన్‌పై భారత్ పరస్పరం నిందలకు దిగడం వల్ల ఇరుదేశాలకూ ఒరిగేదేమీ లేదు. వాటిపై ఎంత వాదించుకున్నా మళ్లీ మొదటికే వస్తాం. ఇరుదేశాల ఎదుగుదల ఈ పరస్పర నిందలు ఎంతమాత్రం పనిచేయవు' అని గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. గత కొద్దివారాలుగా భారత మీడియా తనను బాలీవుడ్ విలన్‌లా చూపించిందని ఇమ్రాన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments