Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆర్మీ చేతిలో తృటిలో షరీష్ - ముషారఫ్ ఎస్కేప్.. లేకుంటేనా....

పాకిస్థాన్ ప్రస్తుత ప్రధానమంత్రి నవాజ్ షరీప్, ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్‌లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అదీ కూడా భారత ఆర్మీ చేతిలోనే. ఇరు దేశాల మధ్య 1999లో కార్గిల్ యుద్ధం

Webdunia
సోమవారం, 24 జులై 2017 (16:42 IST)
పాకిస్థాన్ ప్రస్తుత ప్రధానమంత్రి నవాజ్ షరీప్, ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్‌లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అదీ కూడా భారత ఆర్మీ చేతిలోనే. ఇరు దేశాల మధ్య 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో వారిద్దరూ వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. 
 
'1999 జూన్ 24వ తేదీ ఉదయం 8:45 గంటలకి జాగ్వార్ యుద్ధ విమానం కాక్‌పిట్ లేజర్ డిజిగ్నేషన్ సిస్టమ్ (సీఎల్‌డీఎస్) పాయింట్ 4388 వద్ద సిద్ధంగా ఉంది. ఎల్వోసీ మీదుగా గుల్తేరీ వద్ద పైలట్ గురిపెట్టాడు. అయితే బాంబును అక్కడ విడిచిపెట్టలేదు. లేజర్ బాస్కెట్ బయట దాన్ని విడిచిపెట్టారు' అని నివేదికలో ఉన్నట్టు జాతీయ మీడియా ఉటంకించింది. 
 
ఆ రోజు భారత ఆర్మీ ఏమాత్రం తొందరపడినా షరీఫ్, ముషారఫ్‌లు ప్రాణాలు కోల్పోయేవారు. దీనికి కారణం గుల్తేరి స్థావరంపై బాంబు దాడి చేసేందుకు వెళ్లిన జాగ్వార్ యుద్ధ విమాన పైలట్‌కు అక్కడ పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీచీఫ్ ఉన్నట్టు గుర్తించి వెనక్కి తగ్గారు. పలుమార్లు ఎయిర్ కమాండోర్... బాంబు పేల్చకుండా పైలట్‌ను ఆపారు. అప్పటికే విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్న బాంబును నియంత్రణ రేఖ ఇవతల భారత భూభాగంలో విసరాలని సూచించారు. దీంతో వారిద్దరు ప్రాణాలతో బతికిబయటపడ్డారని ఆ జాతీయ పత్రిక పేర్కొంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments