Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునయన భర్త కూచిభొట్లకు ‘కాన్సస్‌’ అరుదైన నివాళి!

అమెరికాలో జాతివిద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభొట్ల గౌరవార్ధం మార్చి 16ను ‘భారతీయ–అమెరికన్‌ ప్రశంస దినం’(అప్రీసియేషన్‌ డే)గా జరుపుకోవాలని కాన్సస్‌ రాష్ట్రం నిర్ణయించింది.

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (07:19 IST)
అమెరికాలో జాతివిద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభొట్ల గౌరవార్ధం మార్చి 16ను ‘భారతీయ–అమెరికన్‌ ప్రశంస దినం’(అప్రీసియేషన్‌ డే)గా జరుపుకోవాలని కాన్సస్‌ రాష్ట్రం నిర్ణయించింది. కాన్సస్‌ రాజధానిలో భారతీయ అమెరికన్లు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమంలో ఆ విషయాన్ని ్సస్‌ గవర్నర్‌ బ్రౌన్‌బాక్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 22న కాన్సస్‌లోని ఒలేతేలో అమెరికా నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు సమాజంలో విభేదాలు సృష్టించలేవని, కాన్సస్‌ సంస్కృతి అది కాదని బ్రౌన్‌ అన్నారు. శ్రీనివాస్‌ మృతి పట్ల గవర్నర్‌ బహిరంగ క్షమాపణలు చెప్పారు.
 
అలోక్, గ్రిలట్‌లు వేగంగా కోరుకోవాలని అభిలషించారు. భారతీయ సమాజానికి అండగా ఉండేందుకు కాన్సస్‌ కట్టుబడి ఉందని, హింస, హాని చేసే చర్యల్ని ఎల్లప్పుడూ తిరస్కరిస్తామని, విద్వేషం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాల్పుల్లో గాయపడ్డ మేడసాని అలోక్, గ్రిలట్‌లు  పాల్గొన్నారు. ఏప్రిల్‌ నెలను ‘సిక్కు అవగాహన, స్మారక నెల’గా జరుపుకోవాలని డెలావేర్‌ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. ఆ మేరకు అసెంబ్లీలోని సెనేట్, ప్రతినిధుల సభలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments