Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగు చూసి ముస్లిం అనుకుంటారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: శ్రీనివాస్ భార్య ప్రశ్న

అమెరికాలో కాల్పులతో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన భార్య సునయన తీవ్రస్థాయిలో మీడియా ముందు విరుచుకుపడింది. తన భర్త మృతి వృధా కాకూడదన్నారు. శ్రీన

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (11:52 IST)
అమెరికాలో కాల్పులతో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన భార్య సునయన తీవ్రస్థాయిలో మీడియా ముందు విరుచుకుపడింది. తన భర్త మృతి వృధా కాకూడదన్నారు. శ్రీనివాస్ హత్యపై అమెరికా సమాజం, అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో సునయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఆకారం చూసి.. ఆయన ఓ ముస్లిం అనుకుని దుండగుడు కాల్పులు జరిపాడని చెప్పారు. 
 
అసలు రంగు చూసి ఎలా ముస్లిం అనే నిర్ణయానికి వస్తారని ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యకు కారణమైన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ జాత్యహంకార దాడులతో ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. అమెరికాపై తన భర్త ఎంతో ప్రేమ చూపించారనీ.. నేవీ రంగానికి ఎంతే సేవ చేయాలనుకున్నారని సునయన వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆయన అధైర్యపడలేదని అన్నారు. 
 
ఇదిలా ఉంటే.. అమెరికా ఒలేత్ లోని ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్స్ రెస్టారెంటులో షూటింగ్ సంఘటనపై ఎఫ్‌బీఐ విచారణ మొదలుపెట్టింది. ఏవియేషన్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌పై జాతివిద్వేషంతోనే కాల్పులు జరిగాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. రెస్టారెంటులో ఉన్నవాళ్ళంతా టీవీలో వస్తున్న బాస్కెట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారని, నిందితుడు పూరింటన్ ఉన్నట్టుండి అసహనంతో గొడవకు దిగాడని సాక్షులు చెప్పారు. 
 
రెస్టారెంటుకు తరచూ వచ్చే గ్రిలిట్ .. పూరింటన్‌ను అడ్డుకున్నాడు. ‘ఇది ఫ్యామిలీ రెస్టారెంటు… ఇక్కడ ఇలాంటివి కుదరదు, వెళ్ళిపోవాలని సూచించాడని సాక్షులు చెప్పారు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న పూరింటన్ బయటకు వెళ్లి… కాస్సేపటికే తిరిగొచ్చి ‘గెటౌట్ ఆఫ్ మై కంట్రీ’  అంటూ కాల్పులు జరిపాడని సాక్షులు వెల్లడించారు.  

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments