Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక టార్చర్ భరించలేకపోతున్నా.. చచ్చేలోపు సొంతూరికి చేర్చండి... ప్లీజ్

గల్ఫ్‌లో లైంగిక వేధింపులు భరించలేకపోతున్నాను. చచ్చేలోపు తనను సొంతూకురు చేర్చాలని ఓ మహిళ ప్రాధేయపడుతోంది. 18 నెలలుగా సౌదీ అరేబియాలోని భారతీయ ఎంబసీలో తల దాచుకొంటున్నా, స్వస్థలానికి చేరుకుంటానన్న ఆశ ఆమె

Webdunia
మంగళవారం, 30 మే 2017 (09:31 IST)
గల్ఫ్‌లో లైంగిక వేధింపులు భరించలేకపోతున్నాను. చచ్చేలోపు తనను సొంతూకురు చేర్చాలని ఓ మహిళ ప్రాధేయపడుతోంది. 18 నెలలుగా సౌదీ అరేబియాలోని భారతీయ ఎంబసీలో తల దాచుకొంటున్నా, స్వస్థలానికి చేరుకుంటానన్న ఆశ ఆమె కళ్లలో కనిపించడం లేదు. దీంతో దీనంగా ఆమె ప్రాధేయపడుతూ సొంతూరుకు చేర్చాలని కోరుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కడప జిల్లా రాయచోటిలోని లక్కిరెడ్డిపల్లె కొత్తపేట కాలనీకి చెందిన కొత్తపేట గంగమ్మ సౌదీలోని ఓ సేఠ్‌ ఇంట్లో పనిచేయడం కోసం ఏడేళ్ల క్రితం ఊరు వదిలిపోయింది. ఏజెంటుకు లక్ష రూపాయలు చెల్లించి.. కువైట్‌కు చేరుకొంది. అక్కడ సేఠ్‌ ఇంట్లో కొంతకాలం పనిచేసింది. సౌదీలో ఉన్న తన బంధువుల ఇంట్లో పని మనిషి అవసరం పడటంతో.. గంగమ్మను ఆయన వారి వద్దకు పంపించాడు. కొత్త ప్రదేశంలో పని బాగా పెరిగిపోయింది. 
 
దానికితోడు వేధింపులూ పెరిగాయి. జీతం సరిగా ఇవ్వకపోవడం, ఒక్కోసారి జీతం అడిగితే కొట్టడం చేయడంతో ఇక అక్కడ ఉండలేకపోయింది. తనను పాత సేఠ్‌ దగ్గరకు పంపించాలని అడిగినందుకు, తీవ్రంగా కొట్టి గంగమ్మను రోడ్డు మీదకు నెట్టేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కొందరు స్థానిక భారతీయులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి చేర్చారు. అప్పటినుంచి ఎంబసీలోనే ఆశ్రయం పొందుతోంది. తనను తన ఊరు పంపించాలని కనిపించిన అధికారినల్లా ప్రాధేయపడుతోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం