Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసా అద్భుతమైన చిత్రం.. గుమ్మడి రసం మాదిరి వుందిగా..!

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (14:54 IST)
Pumpkin
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఓ అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. ఇది గుమ్మడి రసం మాదిరిగా ఉంది. అందుకే దీనిని జుర్రేయండి అంటూ ట్వీట్ చేసింది. ''పంప్‌కిన్ స్పేస్ లాటే ఎనీవన్'' అని ఊరించింది. ఇది నక్షత్రాలకు తగినదని పేర్కొంది. 
 
ఆస్ట్రనాట్ స్కాట్ కెల్లీ దీనిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి తీశారని పేర్కొంది. పాల మీగడ వంటి మేఘాలు, కాలిన నారింజ పండ్ల రంగు, గాఢమైన ఎరుపుదనం కలగలిసి ఓ క్లాసిక్ ఆటమ్న్ డ్రింక్‌ను గుర్తు చేసే ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆస్ట్రేలియా అని తెలిపింది. ఇక ఆలస్యం చేయకుండా తాగేయండి అని పేర్కొంది.
 
ఈ ఫొటోకు ఎనిమిది లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. లెక్కలేనన్ని కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది ఇది చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ''స్పేస్ స్పైస్ అండ్ ఆల్ థింగ్స్ నైస్'' అని కామెంట్ పెట్టారు. 
 
దీనికి నాసా స్పందిస్తూ ఓ స్మైలీ ఎమోజీని పెట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ కూడా ఓ ట్వీట్‌లో స్పందించింది. ''యెస్ ప్లీజ్! యూరోప్‌కు త్వరగా డెలివరీ చెయ్యండి'' అని కోరింది. దీనిపై నాసా స్పందిస్తూ, ''కమింగ్ రైట్ అప్'' అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments