డ్రాగన్ కంట్రీ చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:56 IST)
డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టివార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరి తైవాన్‌పై దాడి చేస్తే మాత్రం సహించబోమని, తాము చైనాపై దాడి చేస్తామని హెచ్చరించారు. 
 
తైవాన్‌పై చైనా దాడికి తెగబడితే అపుడు తైవాన్‌ను ర‌క్షిస్తారా అని జో బైడెన్‌ను ఓ విలేఖ‌రి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, ఒక‌వేళ తైవాన్‌పై చైనా దాడి చేస్తే, అప్పుడు తైవాన్‌కు అండ‌గా పోరాడుతామ‌ని తెలిపారు. 
 
అవును తాము ఆ విష‌యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే తైవాన్ అంశంలో త‌మ ప్ర‌భుత్వ విధానంలో ఎటువంటి మార్పులేద‌ని వైట్‌హౌస్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. 
 
బైడెన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో త‌మ విధానం ఏమీ మార‌ద‌ని, ఒక‌వేళ డ్రాగ‌న్ దేశం దాడి చేస్తే, తామే ప్ర‌తిదాడి ఇస్తామ‌ని తైవాన్ పేర్కొన్న‌ది. చాన్నాళ్ల నుంచి తైవాన్ అంశంలో అమెరికా వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటించింది. అయితే తాజాగా బైడెన్ చేసిన కామెంట్ కొంత ఆస‌క్తిని రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments