Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు కళ్లెం.. తప్పనిసరిగా 100 రోజులు మాస్కు ధరించాల్సిందే.. జో బైడెన్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (11:53 IST)
Joe biden
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలకలం సృష్టిస్తున్న వేళ అమెరికాకు విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ పరీక్ష చేయించుకొని విమానం ఎక్కాల్సిందేనని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికాలో దిగిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. 
 
కొవిడ్‌-19పై పోరుకి జాతీయ ప్రణాళికను జారీ చేసిన బైడెన్ సర్కార్‌.. వందరోజుల్లో 10 కోట్లమందికి టీకా ఇచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య నెల రోజుల్లో 5 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బైడెన్‌. 
 
యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొవిడ్ టీకా పంపిణీలో లోపాలు సరిచేసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ వంద రోజుల పాటు ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు.
 
kరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించిన దేశంగా భారత్‌ నిలిచింది. ఆరురోజుల్లో 10 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చిన తొలి దేశంగా భారత్ అవతరించింది. 
 
దేశవ్యాప్తంగా నిన్నటితో ఆరవ రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. టీకా డ్రైవ్‌ ప్రారంభం రోజు జనవరి 16 నుంచి నిన్నటి వరకు 10 లక్షల 40 వేల 14 మందికి భారత్ వ్యాక్సిన్‌ వేసింది. దీంతో కొత్త రికార్డులను నెలకొల్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments