Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపాలను తట్టుకునేలా బుల్లెట్ రైలు.. గంటకు 360 కిమీ వేగంతో పరుగు

Webdunia
శనివారం, 25 మే 2019 (17:35 IST)
జపాన్ బుల్లెట్ రైల్ సరికొత్త రికార్డును సృష్టించింది. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. తాజాగా నిర్వహించిన టెస్ట్ డ్రైవ్‌లో ఎన్.700 సుప్రీం అనే పేరు పెట్టిన బుల్లెట్ రైలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లి ఔరా అనిపించింది. 
 
పైగా, ఈ సుప్రీం బుల్లెట్ రైలును తక్కువ బరువుతో పాటు.. తక్కువ ఇంధన వినియోగంతో తయారు చేశారు. ముఖ్యంగా, జపాన్ దేశంలో భూకంపలు తరచూ సంభవిస్తాయన్న నేపథ్యంలో, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
 
కాగా, సెంట్రల్ జపాన్ రైల్వే కార్పొరేషన్ దీన్ని ప్రయోగాత్మకంగా మయబరా, క్యోటో నగరాల మధ్య నడిపి చూసింది. అత్యధికంగా 360 కిమీ వేగం అందుకున్నట్టు గుర్తించారు. బుల్లెట్ షింకాన్సెన్ రైళ్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం అని జపాన్ రైల్వే వర్గాలు తెలిపాయి. జపాన్ లో 1964 నుంచి బుల్లెట్ రైళ్లు వినియోగంలో ఉన్నాయి.
 
కాగా, జపాన్ సహకారంతో భారత్ కూడా బుల్లెట్ రైల్‌ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెల్సిందే. ఈ రైలు ఢిల్లీ - అహ్మాదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments