Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్తాన్‌పై అఖిలపక్ష సమావేశం.. తెలుగు వాళ్లున్నారు...

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (16:33 IST)
ఆఫ్ఘనిస్తాన్‌పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ. ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావాలని కోరాం. ఆఫ్ఘనిస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైంది. తాలిబన్లతో చర్చలు జరిపి అందరిని క్షేమంగా తీసుకురావాలి అని పేర్కొన్నట్లు తెలిపారు. మన దేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి.
 
భారతీయులను, పెట్టుబడులను కూడా పరిరక్షించాలి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వ్యూహాలను రూపొందించాలి. అఖిల పక్ష నేతల సూచనలను, అభిప్రాయాలను విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జయశంకర్ రాసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని మంత్రి జయశంకర్ చెప్పారు ఆయన పేర్కొన్నారు.
 
విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్‌ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. వైకాపా నుంచి మిథున్‌రెడ్డి, తెదేపా తరఫున గల్లా జయదేవ్‌, తెరాస నుంచి నామా నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments