Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకీ చాన్: తనయుడి నడతకు సిగ్గుపడుతున్నా..సారీ!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (14:56 IST)
సూపర్ స్టార్ జాకీ చాన్ తన తనయుడి నడత పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జాకీ చాన్ తనయుడు జేసీ చాన్ (31) కిందటివారం డ్రగ్స్‌తో పట్టుబడడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దీనిపై జాకీ చాన్ ఓ క్షమాపణ లేఖను వెలువరించారు. 
 
చైనా రాజధాని బీజింగ్‌లోని తన నివాసంలో మూడున్నర ఔన్సుల మత్తు పదార్థంతో జేసీ దొరికిపోయాడు. దీనిపై సొంత వెబ్ సైట్లో క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. తన కుమారుడి నడవడికకు తానే బాధ్యత వహిస్తున్నానని తెలిపారు. 
 
ఈ వార్త విన్న వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని పేర్కొన్నారు. ఓ పబ్లిక్ ఫిగర్‌గా... అతనికి తండ్రినైనందుకు సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరో వ్యక్తి గుండెపగిలిందని, ఆమె జేసీ తల్లి అని జాకీ వివరించారు. 
 
"జేసీ చేసిన పొరబాటు నుంచి నేటితరం యువత పాఠం నేర్చుకుని డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో మావాడికి ఒక్కటే చెబుతాను... 'నువ్వు చేసిన తప్పు కారణంగా ఉత్పన్నమయ్యే పర్యవసానాలకు నువ్వే బాధ్యత వహించాలి' అని. 
 
ఇక, తండ్రిని కాబట్టి అతడి బాధ్యత నాకు ఎలానూ తప్పదు. మరొక్కసారి నా తరపున, జేసీ తరపున సమాజానికి క్షమాపణలు తెలుపుకుంటున్నాను" అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments