Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవక

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:52 IST)
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అక్కడ నివాసముంటున్న ఎన్నారైలకు పెద్ద దెబ్బే. అంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కట్టాల్సి వుంటుంది. 
 
అమెరికాలో ఉద్యోగం, జీవితం అనేది వార్షిక వేతనం దాదాపు కోటి రూపాయల దాకా వున్నవారికే సాధ్యం. కాబట్టి అమెరికాలో అంత భారీ మొత్తంలో జీతాలు ఇస్తే దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు భారీ నష్టాలను చవిచూడక తప్పదు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులకు శరాఘాతంగా మారుతుంది. 
 
మరోవైపు ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే భార‌త ఐటీ దిగ్గ‌జ కంపెనీలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మ‌హీంద్రా షేర్లు 9 శాతం మేర నష్టాలు చవిచూశాయి. ఇక మ‌ధ్య‌స్థాయి ఐటీ కంపెనీల షేర్లు దారుణంగా కుప్పకూలాయి. గమనించాల్సిన విషయం ఏమంటే... బీఎస్ఈలో 4 శాతం న‌ష్టంతో ఎక్కువ న‌ష్టాన్ని మూటగట్టుకున్నది ఐటీ రంగం కావడం. మున్ముందు ట్రంప్ మరెన్ని షాకులిస్తారో వేచి చూడాల్సిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments