Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా ఆస్పత్రిలో పేలుడు... 500 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (10:11 IST)
హమాస్ ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదులకు మంచి పట్టుున్న గాజాలో రాకెట్‌ దాడులతో విరుచుకుపడుంది. తాజాగా గాజాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన పేలుడుధాటికి 500 మంది వరకు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడి వల్లే ఈ ఘోరం జరిగిందని హమాస్ ఆరోపిస్తుంది. 
 
గాజాలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడసంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. గాజా సిటీలోని అల్ అహ్లి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. 
 
మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడా బాంబు దాడులు చేస్తోంది. మంగళవారం దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ మంగళవారం ఇజ్రాయెల్, హెజొ‌బొల్లా మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments