Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... వీడియో పోస్ట్ చేశారు...

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (14:56 IST)
ఇస్లామిక్ ఉగ్రవాదులు సిరియాలో పేట్రేగిపోయారు. రెండేళ్ళ క్రితం కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ పోలీ తలను కిరాతకంగా నరికేసి, ఆ జర్నలిస్టు తల నరకక ముందు ఫొటోని, తల నరికిన తర్వాత ఫొటోలతోపాటు వీడియోను కూడా మీడియాకి పంపారు. ఉగ్రవాదుల హేయమైన చర్య తాలూకు వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ తీవ్రవాదులు 'అమెరికాకు ఓ సందేశం' అనే వీడియో పోస్ట్ చేశారు. 
 
నారింజ రంగు దుస్తులు ధరించిన ఫోలీని ఓ ఎడారి ప్రాంతంలో మోకాళ్ల మీద నిలబెట్టి, పక్కనే ఓ ఉగ్రవాది తలకు ముసుగు వేసుకుని నల్ల దుస్తుల్లో ఉన్నాడు. సాధారణంగా నారింజ రంగు దుస్తులను అమెరికా సైన్యం అదుపులో ఉండే ఖైదీలకు వేస్తారు. అతడి పక్కనే ఉన్న ఉగ్రవాది ఇంగ్లీషులో మాట్లాడాడు. 
 
ఆ తర్వాత అతడు జేబులోంచి కత్తి తీసి, ఫోలీకి మరణశిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు. ఇరాక్లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించడంతో అందుకు ప్రతీకారంగా ఈ శిక్ష వేస్తున్నామన్నారు. ఫోలీ కూడా తన చావుకి అమెరికాయే కారణం అని చెప్పినట్టుగా వీడియోలో వుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments