Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ : రసాయన దాడి చేసిన ఐఎస్ఐఎస్

అమెరికా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తొలిసారి అమెరికా సైన్యంపై రసాయన దాడి చేశారు. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైన్యం, ఉగ్రవాదులతో పోరాడుతున్న వ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:04 IST)
అమెరికా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తొలిసారి అమెరికా సైన్యంపై రసాయన దాడి చేశారు. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైన్యం, ఉగ్రవాదులతో పోరాడుతున్న వేళ, రసాయన దాడి జరిగింది. మిలిటెంట్లు అత్యంత ప్రమాదకర రసాయనాలను కూర్చిన బాంబులను ప్రయోగించినట్టు తెలుస్తోందని పెంటగాన్ ప్రతినిధి తెలిపారు. 
 
అమెరికా జవాన్లు ఉన్న ఖురయ్యా ఎయిర్ ఫీల్డ్ ప్రాంతంలో ఒకే ఒక్క బాంబు షెల్‌లో రసాయన అవశేషాలు ఉన్నాయని నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ వెల్లడించారు. దీన్ని ఓ రాకెట్ లేదా మోర్టార్ ద్వారా ప్రయోగించి ఉంటారని, సైనికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు. కాగా, అమెరికా సైన్యంపై జరిగిన తొలి రసాయన దాడి ఇదేనని వివరించారు. 
 
ఈ రసాయన దాడిలో మస్టర్డ్ గ్యాస్‌ను వాడారని, ఈ విషవాయువు తగిలితే, శరీరం కాలిపోవడం, అంధత్వం, శాశ్వత వికలాంగత్వం సంభవిస్తాయని తెలిపారు. రసాయన ఆయుధాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు గ్యాస్ మాస్కులు సహా, అన్ని రకాల రక్షణ సాధనాలూ యూఎస్ సైన్యం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments