Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ 'మిస్ యూనివర్స్' సుస్మితా సేన్... అప్పుడు నవ్వింది... ఇప్పుడు ఏడ్చింది... ఎందుకంటే?

1994లో అంటే సరిగ్గా 23 ఏళ్ల క్రితం సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటం ధరించింది. ఆ సందర్భంలో ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటం రావడంపై ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఈ ఏడాది 2017లో మిస్ యూనివర్స్ పోటీల్లో ఓ విశేషం ఉంది. అదేంటయా అంటే... ఈ పోటీలకి జడ్జి ప్

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (14:43 IST)
1994లో అంటే సరిగ్గా 23 ఏళ్ల క్రితం సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటం ధరించింది. ఆ సందర్భంలో ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటం రావడంపై ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఈ ఏడాది 2017లో మిస్ యూనివర్స్ పోటీల్లో ఓ విశేషం ఉంది. అదేంటయా అంటే... ఈ పోటీలకి జడ్జి ప్యానెల్లో సుస్మితా సేన్ కూడా వున్నారు. ఈ ఏడాది మన దేశం తరపున మిస్ యూనివర్స్ పోటీలో బరిలో దిగిన అమ్మాయి కర్నాటకకు చెందిన రోహ్మతి హరిమూర్తి. ఈమె కిరీటాన్ని సాధిస్తారనుకున్నారు కానీ ఆమె చాలా వెనుకబడిపోయారు. 
 
ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని 23 ఏళ్ల ఫ్రాన్స్ అందాల భామ ఇరిన్ మిట్టెనరీ కైవసం చేసుకున్నారు. ఆమెకు గత ఏడాది విశ్వసుందరిగా ఎంపికైన ఫిలిఫ్పైన్ భామ పియా వుట్జ్ బెక్ తన కిరీటాన్ని ఇరిన్‌కు అలంకరించడంతో అక్కడ హర్షధ్వానాలు మిన్నంటిపోయాయి. ఇక మొదటి రన్నరప్‌గా మిస్ హైతి రక్వెల్ పెలిస్సైర్ నిలిచింది. రెండో రన్నరప్‌గా మిస్ కొలంబియా నిలిచింది. మన దేశం నుంచి పోటీకి దిగిన హరిమూర్తి 13వ స్థానంలో నిలబడింది. ఐతే సుస్మితా మన అమ్మాయి గెలుస్తుందని అనుకున్నదేమోగానీ విజేతను ప్రకటించినప్పుడు ఆమె కళ్లలో చిన్న కన్నీటి తెర కనిపించిందట. మరి మనకు కిరీటం దక్కలేదని ఆవేదనో లేదంటే గత స్మృతులు గర్తుకు వచ్చాయో తెలీదు మరి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments