Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐర్లాండ్‌లో స్వలింగ సంపర్క వివాహాలపై రెఫరెండం.. గే పెళ్లికి చట్టబద్ధత ఇవ్వాలా వద్దా!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (18:05 IST)
స్వలింగ సంపర్క (గే) వివాహాలపై అనేక దేశాలు తమ వైఖరిని మెల్లగా మార్చుకుంటున్నాయి. ఇటీవల లక్సెంబర్గ్ ప్రధానమంత్రి తన సహచరుడిని విహహం చేసుకుని ప్రపంచంలోని గే వర్గానికి చెందిన స్త్రీ పురుషులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాగే, గే వివాహం చేసుకుని ప్రపంచం దృష్టిని తన వైపుకు మళ్ళించుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది ఈ తరహా వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐర్లాండ్ దేశంలో గే వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశంపై రెఫరెండం నిర్వహిస్తున్నారు. ఐర్లాండ్‌లో రెఫరెండం సర్వసాధారణం. పలు విషయాలపై ప్రజల అభిప్రాయంతోనే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. 'ఎస్', 'నో' అనే ఆప్షన్లలో ప్రజలు తమ అభిప్రాయం రెఫరెండంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు దేనికి వస్తే, దానిని అమలు చేస్తారు. 
 
ఐర్లాండ్ కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది వరకు 'గే' వివాహాలపై రెఫరెండం నిర్వహిస్తున్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం 'గే' వివాహాలకు చట్టబద్ధత లభిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి 'లెస్బియన్లు', 'గే' వివాహాలకు చట్టబద్ధత కల్పించడంలో విదేశాలు పోటీ పడుతున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments