Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగ్దాద్ సదర్ మార్కెట్‌లో బాంబు పేలుడు : 35 మంది మృతి

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (10:51 IST)
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ సదర్‌ నగరంలోని మార్కెట్లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు.  అనేక మంది గాయపడ్డారు. మార్కెట్‌లో బక్రీద్‌ (ఈద్‌ అల్‌-అధా) పండుగకు పెద్ద ఎత్తున జనం మార్కెట్లకు రాగా.. అదును చూసి ఉగ్రవాదులు బాంబు పేల్చారు. 
 
అప్పటివరకు కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దుకాణాలు మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎటు చూసినా రక్తపు మరకలు.. బాధితుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనలో 60 మంది వరకు గాయపడ్డారని, ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
 
మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి కొన్ని దుకాణాలు కాలిబూడిదయ్యాయి. స్థానికంగా తయారు చేసిన ఐఈడీతోనే ఉగ్రవాద దాడి జరిగిందని ఇరాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాడి ఘటనపై ఇరాక్‌ అధ్యక్షుడు బర్హామ్‌ సలీమ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఏ ఒక్క ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments