Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు.. ఇలా చేశాడు..

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (12:36 IST)
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ప్రేమికుడి చేతిలో ఓ ప్రేయసి మోసపోయింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో వున్న ఓ డేటింగ్ యాప్ ద్వారా.. మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకునే వెసులుబాటు వుంది. అయితే ఇలాంటి యాప్‌ల ద్వారా నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి మోసమే ఇండోనేషియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని టిబాక్ ప్రాంకంలో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 39 ఏళ్ల ప్రేమికుడు ఆందికా తన 41 ఏళ్ల ప్రేయసి వాక్స్ కారును దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గత వారం వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. గతవారం ఓ మాల్‌కు వెళ్లారు. అక్కడ వాక్స్ షాపింగ్ చేస్తుండగా, ఆమె కారును ఆందికా దొంగలించుకుని పారిపోయాడు. 
 
దీనిపై వాక్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. విచారణలో ఆందికా పక్కా ప్లాన్ ప్రకారమే కారును దొంగలించాడని తేలింది. అంతేగాకుండా అతడు తరచూ కార్లను దొంగలించేవాడని పోలీసులు కనుగొన్నారు. దీంతో పరిచయం లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునే వారు.. ఇకపై జాగ్రత్త పడాలని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments