Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో సునామీ, భూకంపం- మసీదు నీట మునిగింది... 30 మంది మృతి

ఇండోనేషియాలో సునామీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందంగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. కాగా, శు

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (10:18 IST)
ఇండోనేషియాలో సునామీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందంగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. కాగా, శుక్రవారం రాత్రి సమయంలో సునామీ ఇండోనేషియా తీరాన్ని తాకి బీభత్సం సృష్టించింది.
 
భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పౌలు నగరంలోని ప్రజలను రక్షించేందుకు అధికారులు సహాయక బృందాలను పంపించినట్లు ఇండోనేషియా మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునామీ, భూకంపం కారణంగా 300,000 మంది నిరాశ్రయులైనారు. భీకర అలలు ఎత్తైన భవనాలను తాకడం, పౌలు నగరంలోని అతిపెద్ద మసీదు కూడా సునామీ అలల తాకిడికి గురికావడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కాగా.. 2004 తర్వాత ఇండోనేషియా దీవుల్లో సునామీ రావడం ఇదే తొలిసారి. అప్పట్లో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 2,20,000 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 1,68,000 మంది ఇండోనేషియా వాసులే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments