Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా: యువతితో డేటింగ్‌... ఆపై అపస్మారక స్థితిలోకి హైదరాబాద్ విద్యార్థి

హైదరాబాద్ విద్యార్థి ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయాడు. మౌలిన్ రాథోడ్ అనే యువకుడు.. ఓ యువతితో డేటింగ్‌కు వెళ్లాడు. అయితే డేటింగ్ తర్వాత అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి త

Webdunia
గురువారం, 26 జులై 2018 (14:32 IST)
హైదరాబాద్ విద్యార్థి ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయాడు. మౌలిన్ రాథోడ్ అనే యువకుడు.. ఓ యువతితో డేటింగ్‌కు వెళ్లాడు. అయితే డేటింగ్ తర్వాత అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు.. రాథోడ్‌తో ఉన్న యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
రాథోడ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కి తరలించేందుకు భారతీయ ఎంబసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మౌలిన్‌ రాథోడ్ స్వస్థలం అహ్మదాబాద్‌. వ్యాపార రీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. 
 
25 ఏళ్ల మౌలిన్.. ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఓ యువతిని సంప్రదించి డేటింగ్ వెళ్లాడని.. సోమవారం రాత్రి యువతి నివాసమైన రాస్ కోర్టుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. 19ఏళ్ల యువతితో డేటింగ్ పూర్తయ్యాక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని, అయితే అతని దేహంపై గాయాలున్నాయని.. అతనిని హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. 
 
మాస్టర్ ఆఫ్ అకౌంటింగ్ చదువుతున్న రాథోడ్‌తో గడిపిన యువతిని పోలీసులు మెల్‌బోర్న్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు వారం రోజుల రిమాండ్ విధించింది. రాథోడ్ అతడి తల్లిదండ్రులకు ఒకడే కుమారుడని, చదువు పట్ల అతనికి శ్రద్ధ ఎక్కువని రాథోడ్ స్నేహితులు చెప్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాదుకు రాథోడ్ మృతదేహాన్ని తరలించేందుకు స్నేహితులు డబ్బు పోగు చేస్తున్నట్లు రాథోడ్ స్నేహితుడు లవ్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments