Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలా?

ఓ చిరుద్యోగి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీనికి కారణం అతనికి బిగ్ టిక్కెట్ డ్రా వరించింది. ఫలితంగా అతనికి రాత్రికిరాత్రే ఏకంగా రూ.8.27 కోట్లు వచ్చాయి. అతని పేరు కృష్ణంరాజు. భారతీయ కార్మికుడు.

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (13:14 IST)
ఓ చిరుద్యోగి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీనికి కారణం అతనికి బిగ్ టిక్కెట్ డ్రా వరించింది. ఫలితంగా అతనికి రాత్రికిరాత్రే ఏకంగా రూ.8.27 కోట్లు వచ్చాయి. అతని పేరు కృష్ణంరాజు. భారతీయ కార్మికుడు. దుబాయ్‌లోని రస్‌ అల్‌ఖైమాలో ఓ నిర్మాణ రంగ సంస్థలో 9 ఏళ్ల నుంచి చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. తాజాగా అబుదాబీలో వెలువడిన 'బిగ్‌ టికెట్‌ డ్రా'లో అతడిని లక్ష్మీదేవి వరించింది. 
 
దీనిపై అతను స్పందిస్తూ... గత మూడేళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇందుకు ప్రతినెలా సంపాదనలో కొంత డబ్బును పక్కన పెట్టేవాడినని చెప్పాడు. ఈ దఫా మాత్రం లక్కీగా ధరనంతా తానే భరించి టికెట్‌ కొన్నట్టు చెప్పాడు. 
 
కానీ బిగ్ లాటరీ టిక్కెట్ సంస్థ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు నమ్మలేక పోయినట్టు చెప్పాడు. వాళ్లు ఫోన్ పెట్టేశాక.. ఆ సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేశా. అప్పటికి వాళ్లు దాన్ని అప్‌డేట్ చేయలేదు. ఒక అరగంట తర్వాత మళ్లీ చూశానని అప్పుడే తనకు లాటరీ తగిలినట్టు నిర్ధారించుకున్నట్టు చెప్పాడు. 
 
ఆ తర్వాత 'అప్పుడే నా పేరుతో వాళ్లు ఓ ట్వీట్ చేశారు. దాన్ని చూశాక నాకు ఆనందంతో గుండె ఆగినంత పనయింది. నేను విన్నర్‌గా సెలెక్ట్ అయ్యానని వెబ్‌సైట్‌లో చూశాకే మా వాళ్లకు విషయాన్ని చెప్పా. ఈ అరగంట వరకూ నేను టెన్షన్‌తో గడిపా..' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో ఇన్నాళ్లూ తలభారంగా మారిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయినట్టేనని సంతోషంతో చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments