Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీట్లో నిద్రపోతున్న టీనేజీ బాలిక.. అక్కడ తాకిన ఇండియన్ డాక్టర్...

విమానంలో ఓ భారతీయ వైద్యుడు నీచపు పనికి పాల్పడ్డాడు. తన కుమార్తె వయసున్న టీనేజీ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కసీట్లో నిద్రపోతున్న ఆ బాలికను తాకరానిచోట తాకాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (11:56 IST)
విమానంలో ఓ భారతీయ వైద్యుడు నీచపు పనికి పాల్పడ్డాడు. తన కుమార్తె వయసున్న టీనేజీ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కసీట్లో నిద్రపోతున్న ఆ బాలికను తాకరానిచోట తాకాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ కామాంధపు వైద్యుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే...
 
గత జూలై 23న వాషింగ్టన్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక సీటెల్ నుంచి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూజెర్సీకి ప్రయాణించింది. విమానం ఎక్కిన కొద్దిసేపటికే బాలిక నిద్రపోయింది. ఆమె పక్కసీట్లో భారత్‌కు చెందిన 28 ఏళ్ల డాక్టర్ విజకుమార్ క్రిష్ణప్ప కూడా ప్రయాణిస్తున్నాడు. బాలిక నిద్రలోకి జారుకుందని భావించిన ఆ డాక్టర్ ఆమెను తాకరానిచోట తాకుతూ, నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
అయితే, తనను ఎవరో తడుముతున్నట్లు భావించిన బాలిక... వెంటనే నిద్ర నుంచి మేల్కొంది. ఆ సమయంలో విజకుమార్ నిద్రిస్తున్నట్లు నటించాడు. కానీ ఆ వ్యక్తి మరోసారి అసభ్యంగా తనను తడమడంతో మేల్కొన్న బాలిక ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసి తన సీటును మార్పించుకుంది. విమానం నేవార్క్ లిబర్టీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే పేరేంట్స్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. వారు అక్కడికి చేరుకునేలోగా విజకుమార్ వెళ్లిపోయాడని గుర్తించింది.
 
తమ కూతురు ఫిర్యాదు చేయగా నిందితుడు క్రిష్ణప్పను అరెస్ట్ చేయకుండా, అతడిపై చర్య తీసుకోకుండా వదిలేసిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై కూడా బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ, ఎయిర్‌లైన్స్ వారి సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ డాక్టర్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments