Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా యువతిపై డిజిటల్ రేప్.. భర్తతో కలిసి నిద్రపోతున్నా... చేతుల స్పర్శతో?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (12:52 IST)
భారత్‌లోని యూఎన్ ఏజెన్సీలో పనిచేస్తున్న అమెరికా యువతిపై డిజిటల్ రేప్‌కు పాల్పడిన భారతీయుడికి కోర్టు శిక్ష విధించింది. 2013లో జరిగిన ఈ ఘటనకు ఫిబ్రవరీ 14న ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒహియోకు చెందిన ఆ మహిళ, తన భర్తతో కలిసి ఢిల్లీలో రాజీవ్ పన్వార్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటోంది. 
 
2013 జూన్ 24వ తేదీ తెల్లవారుజామున మహిళ తన భర్తతో కలిసి బెడ్‌రూంలో నిద్రపోతున్న సమయంలో ఇంటి యజమాని గదిలోకి ప్రవేశించాడు. భర్త ప్రక్కనే నిద్రపోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో చేతుల స్పర్శతో ఆమెను ప్రేరేపించడానికి ప్రయత్నించాడు. ఆమెకు మెలకువ రావడంతో రాజీవ్ అక్కడ నుండి పారిపోయాడు. 
 
దీనిపై వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒహియో చట్ట ప్రకారం మహిళను చేతులతో ప్రేరేపించడం కూడా అత్యాచారంగానే పరిగణిస్తారు. ఆ రోజే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాను నేరం చేసినట్లు రాజీవ్ అంగీకరించాడు. కానీ అద్దె డబ్బులు ఇవ్వకుండా తనతో దురుసుగా ప్రవర్తించినందుకే ఇలా చేశానని చెప్పాడు. అయితే ఈ ఘటన కారణంగా భార్యాభర్తల మధ్య చిచ్చు కూడా రగిలింది. ఆమె భారత్ వదిలి అమెరికాకి వెళ్లవలసి వచ్చింది. ఈ నేరం చేసినందుకు కోర్టు నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments