Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్.. మంచు కురిసేలోపే ప్రతీకారం

భారత్‌పై పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోందట. అదీ కూడా జమ్మూకాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయానికే ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:57 IST)
భారత్‌పై పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోందట. అదీ కూడా జమ్మూకాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయానికే ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతాండాలపై భారత ఆర్మీ మెరుపుదాడి జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెల్సిందే. 
 
ఈ సర్జికల్ దాడులపై పాకిస్థాన్ రగిలిపోతోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో, మంచు కురిసే లోపల భారత భూగాగంలోకి ఉగ్రవాదులను పంపి, మారణహోమం సృష్టించేందుకు చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు నిత్యం కాల్పులకు తెగబడుతున్నారు. 
 
ఈ కాల్పులు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు... గత నాలుగు రోజులుగా పాక్‌కు చెందిన ఎస్ఎస్‌జీ కమెండో ప్లటూన్లు సరిహద్దుల్లో మోహరిస్తున్నాయి. 14 నుంచి 15 ప్లటూన్లను ఓ కల్నల్ ర్యాంక్ అధికారి పర్యవేక్షిస్తున్నారని ఇంటలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. మరోవైపు, పాక్ కాల్పులను భారత భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments