Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి.. 18,300 మంది దరఖాస్తు.. 12 మంది ఎంపిక

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్‌ సంతతికి చెందిన యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు. ఎర్త్‌ ఆర్బిట్‌ అండ్‌ డీప్‌ స్పేస్‌ మిషన్ల కోసం నాసా గతంల

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (03:46 IST)
నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్‌ సంతతికి చెందిన యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు. ఎర్త్‌ ఆర్బిట్‌ అండ్‌ డీప్‌ స్పేస్‌ మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది.
 
ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ, అమెరికాలోని నావెల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఉన్న ఎఫ్‌–35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments