Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో చర్చలకు తాలిబన్లు సిద్ధం.. దోహా వేదికగా..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (19:53 IST)
ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో తాలిబన్లు భారత్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దౌత్యపరమైన సంప్రదింపులకు భారత్‌ తరఫున కతర్‌ అంబాసిడర్‌ దీపక్‌ మిట్టల్‌, దోహాలోని తాలిబాన్‌ రాజకీయ ఆఫీస్‌ అధినేత షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ మధ్య చర్చలు జరిగిన విషయాన్ని భారత విదేశీ వ్యహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తాలిబన్ల కోరిక మేరకే సమావేశం జరిపినట్లు భారత్ స్పష్టం చేసింది.
 
ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుపోయిన భారతీయుల భద్రత, రక్షణతోపాటు వారిని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తిరిగి చేరుకునే అంశంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిపినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
భారత్‌కు రావాలని భావిస్తున్న ఆఫ్ఘన్‌ జాతీయలు ముఖ్యంగా ఆదేశంలో ఉన్న మైనారిటీల ప్రయాణం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగం ఉగ్రవాదానికి, భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారరాదనే అంశాన్ని కూడా మిట్టల్‌ ప్రస్తావించారని వివరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments