Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌-చైనాల మధ్య ఒప్పందం.. త్వరలో బలగాల ఉపసంహరణ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (15:24 IST)
భారత్‌-చైనాలు వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు వార్తా సంస్థలు ఊటంకిస్తాయి. గతవారం చుషూల్‌-మాల్దో పోస్టులో జరిగిన చర్చల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ బలగాల ఉపసంహరణ కూడా త్వరలో పూర్తికావచ్చని తెలుస్తోంది. 
 
తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరుపక్షాల బలగాలను ఉపసంహరించి ఏప్రిల్‌-మే నాడు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేరుకొంటాయి. ఈనెల ఆరో తేదీన జరిగిన 8వ విడత కోర్‌కమాండర్‌ చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. వారం రోజుల్లోపు మూడు దశల్లో దీన్ని అమలు చేయాల్సి ఉంది.
 
పాంగాంగ్‌ సరస్సు వద్ద చర్చలు జరిపిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ట్యాంకులతో సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు బాగా దూరంగా తరలించాలి. రెండో దశలో భాగంగా సరస్సు ఉత్తర భాగంలో సైనికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తారు.
 
రోజు 30శాతం బలగాలను మూడు రోజుల పాటు వెనక్కి పంపిస్తారు. భారత్‌ వైపు దళాలు ధ్యాన్‌చంద్‌ థాపా పోస్టు వద్ద ఉంటే చైనా బలగాలు ఫింగర్‌ ఎనిమిది వద్ద ఉంటాయి. ఇక మూడో దశలో చుషూల్‌, రజాంగ్‌లా వద్ద ఇరు పక్షాలు ఆక్రమించిన శిఖరాలు, ప్రాంతాలను ఖాళీ చేసి వెనక్కి వెళ్లాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments