Webdunia - Bharat's app for daily news and videos

Install App

356 నుంచి 492 వరకు అణు బాంబులను తయారు చేసే సత్తా భారత్ సొంతం.. పాక్ మేధావి బృదం

పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసే విషయాన్ని ఆ దేశానికి చెందిన మేధావి బృందం వెల్లడించింది. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇప్పటికిపుడు సుమారు 356 నుంచి 492 వరకు అణు బాంబుల్ని తయారుచేయగలిగి

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (13:05 IST)
పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసే విషయాన్ని ఆ దేశానికి చెందిన మేధావి బృందం వెల్లడించింది. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇప్పటికిపుడు సుమారు 356 నుంచి 492 వరకు అణు బాంబుల్ని తయారుచేయగలిగిన సత్తా భారత్‌ కలిగి ఉందని ఈ బృందం విశ్లేషించింది. ఈ మేరకు సాంకేతిక సామర్ధ్యాన్ని, ముడి సరుకును భారత్‌ కలిగి ఉందని ఈ బృందం అధ్యయనంలో తేల్చింది. 
 
ఇస్లామాబాద్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌(ఐఎస్‌ఎస్‌ఐ)’ - భారత అరక్షిత అణు కార్యక్రమం - పేరుతో ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అణు బాంబుల తయారీలో భారత్‌ సత్తాపై గతంలో జరిగిన పలు అధ్యయనాలకు భిన్నంగా ఇందులో తేలినట్లు ఐఎస్‌ఎస్‌ఐ పేర్కొంది. సంక్లిష్టమైన భారత అణు కార్యక్రమంలోని వివిధ అంశాలపై వాస్తవాలను, సామర్ధ్యాలను వెల్లడించడమే ఈ అధ్యయనం ఉద్దేశమని పేర్కొంది.
 
కాగా, యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, నియంత్రణ రేఖ వద్ద పాక్ రేంజర్లు యధేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దాడులకు ధీటుగానే భారత్ దళాలు కూడా స్పందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ మేధావి బృందం వెల్లడించిన విషయాలు ఆ దేశ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేవిలా ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments