Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో రూ.1280 కోట్ల విలువైన బంగారం చోరీ.. భారతీయుల గృహాలే టార్గెట్

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (13:43 IST)
బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులు హడలిపోతున్నారు. వీరు నివశించే గృహాలను లక్ష్యంగా చేసుకుని ఇంటి దొంగలు చెలరేగిపోతున్నారు. భారతీయుల గృహాల్లో ఉండే బంగారాన్ని చోరీ చేయడమే లక్ష్యంగా వారు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు బీబీసీ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కోంది. 
 
గత ఐదేళ్లలో రూ.1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరీకి గురైందనీ, అందులో అత్యధిక భాగం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి  చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్‌ లండన్‌లో రూ.1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురైంది. 
 
ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు చెపుతున్నారు. 
 
దీపావళి, దసరా వంటి భారతీయ ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్‌ పోలీసులు చెపుతున్నారు. ప్రతీ యేడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments