Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయ్‌లెట్‌కి వెళ్తే.. పురుషాంగాన్ని కొరికిన కొండచిలువ

Webdunia
బుధవారం, 7 జులై 2021 (11:24 IST)
పాము అంటేనే ఆమడ దూరం పారిపోతుంటారు జనం. చాలామంది పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది.. ఆ పాము మన ఇంట్లోకి దూరితే.. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది. అది కూడా ఆ పాము టాయ్‌లెట్‌లో దూరింది. అది చూసుకోకుండా.. ఆయన టాయ్‌లెట్‌లో కూర్చోగా.. అది కాస్త ఆయనను కాటు వేసింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాన్బెర్రాలోని గ్రాజ్ లో ఓ 65ఏళ్ల వృద్ధుడు ఉదయాన్నే టాయ్‌లెట్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో.. ఆయనను ఏదో కరిచినట్లుగా అనిపించింది. వెంటనే ఏంటా అని అనుమానంతో చూడగా..  కొండ చిలువ కనపడింది. దీంతో భయంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. 
 
ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు. 
 
అతని అపార్ట్‌ మెంట్లో  దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.  ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు.
 
కొండ చిలువ బాత్రూంలో కాటువేసిన తర్వాత అది కాలువ లోనికి వెళ్లి తప్పించుకుంది.ఆ యువకుడు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వెంటనే పాములను పట్టేవారికి సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం