Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానాల్లో వున్నారు.. మోదీపై ఇమ్రాన్ ఫైర్

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. ముందుచూపు లేని తక్కువ స్థాయి ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాల్లో వున్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌త

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:26 IST)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. ముందుచూపు లేని తక్కువ స్థాయి ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాల్లో వున్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమంటూ ఈ నెల 14న మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ లేఖ రాశారు.


చర్చలను మళ్లీ కొనసాగించాలని లేఖలో కోరారు. ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనపై తొలుత సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వం న్యూయార్క్‌లో ఇరుదేశాలు భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపింది. 
 
కానీ కాశ్మీర్‌ సరిహద్దుల్లో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌, ముగ్గురు ఎస్పీవోలను పాక్‌ దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో పాక్‌తో చర్చలెలా జరుపుతామంటూ భారత ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో పాకిస్థాన్‌ చర్చలకు భారత్ నో చెప్పినందుకు ఇమ్రాన్ ఫైర్ అయ్యారు. చర్చలకు సిద్ధమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. 
 
తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. భవిష్యత్తు గురించి ముందు చూపులేని చిన్నస్థాయి వ్యక్తులను తన జీవితంలో ఎంతోమందిని చూశానంటూ పరోక్షంగా భారత ప్రధాని మోదీని ఉద్దేశించి ఇమ్రాన్‌ ఖాన్‌‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments