Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు_దుండగుడి కాల్చివేత

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (19:47 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.  
 
ర్యాలీలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ రాజధాని ఇస్లామాబాద్ వైపు పయనిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇమ్రాన్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరుడిగా భావించే ఎంపీ ఫైజల్ జావెద్ కూడా గాయపడ్డారు. 
 
ఈ ర్యాలీ వజీరాబాద్ చేరుకున్న సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ కు గాయాలయ్యాయి. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చిచంపినట్టు వెల్లడైంది.
 
పాక్ ప్రధాని పదవిని కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తూనే వున్నాయి.  విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన దాడిని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్ రాజకీయాల్లో హింసకు తావులేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments