భారతీయ ఉద్యోగుల గుండెల్లో విమానమోత.. ట్రంప్ కొత్త కోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి వచ్చే విదేశీయులకు కష్టాల మీద కష్టాలు ఇస్తున్నారు. విదేశీయులకు శాశ్వత నివాసయోగ్యత కల్పించే గ్రీన్‌కార్డులకు ట్రంప్ అధికార యంత్రాంగం మరింత కోత పెట్టనుంది. ద

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:53 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి వచ్చే విదేశీయులకు కష్టాల మీద కష్టాలు ఇస్తున్నారు. విదేశీయులకు శాశ్వత నివాసయోగ్యత కల్పించే గ్రీన్‌కార్డులకు ట్రంప్ అధికార యంత్రాంగం మరింత కోత పెట్టనుంది. దేశానికి వలస వచ్చి వివిధ రకాలుగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్న లేదా పొందేందుకు వీలున్న వారికి గ్రీన్‌కార్డులు ఇవ్వరాదని ట్రంప్ సర్కార్ ఆలోచిస్తోంది. 
 
ఇదే జరిగితే.. అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం వుంది. ఆహారం, నగదు సాయం తదితర విషయాలలో ప్రభుత్వ పరంగా రాయితీలు పొందే విదేశీయులకు గ్రీన్‌కార్డులు ఇవ్వరాదని, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు సంబంధించి వారు పొందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల గురించి పూర్తిస్థాయిలో ఆరాతీయాలని ఈ నెల 21వ తేదీన అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ ఒక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన గురించి సంబంధిత వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ ప్రతిపాదనపై సిలికాన్ ప్రాంత ఐటి పరిశ్రమ వర్గాలు, రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
విదేశీ వలసదారులు తమ వీసా సర్దుబాట్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నా, గ్రీన్‌కార్డు కోసం తాజాగా అభ్యర్థన చేసుకున్నా విధిగా తాము ఏ దశలోనూ ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేదనే విషయాన్ని తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టసభల తరఫున అనుమతి దక్కితే తప్ప వీటిని అనుభవించడానికి వీల్లేదని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments