Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌ ప్రొడ్యూసరా? స్పాన్సర్లు వెనక్కి.. ఆ షో రేటింగ్ మటాష్: ఆర్నాల్డ్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆ దేశంలో ఉంటున్న విదేశీయులకు భద్రత కరువైంది. ఇప్పటికే ముగ్గురు ప్రవాస భారతీయులు ట్రంప్ విధానాలతో బలైన నేపథ్యంలో, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా స్వదేశంలో ఎప్

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (15:49 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆ దేశంలో ఉంటున్న విదేశీయులకు భద్రత కరువైంది. ఇప్పటికే ముగ్గురు ప్రవాస భారతీయులు ట్రంప్ విధానాలతో బలైన నేపథ్యంలో, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా స్వదేశంలో ఎప్పుడో ఆందోళనలు మొదలయ్యాయి.

దేశంలో ఏం జరుగుతున్నా.. ట్రంప్ మాత్రం తన పనేంటో తాను చూసుకుంటూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే వీసాల రద్దుతో పాటు పలు విధానాలపై సంతకాలు చేసి.. ఎన్నారైలకు చుక్కలు చూపించిన ట్రంప్.. తాజాగా కాల్ సెంటర్ల అవుట్ సోర్సింగ్‌పై కూడా కొరడా ఝుళిపించారు.
 
అయితే ఈ విధానాలను స్వదేశీయులే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ కూడా ఒకరు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల తను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ద న్యూ సెలబ్రిటీ అప్రెంటిస్' అనే షోకు రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జనేగర్ విమర్శలు గుప్పించారు.

ఈ షోకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ట్రంప్ కొనసాగుతుండటంపై గతంలో పలుసార్లు ఆర్నాల్డ్ వ్యతిరేకించారు. అయినా ఇప్పటికీ ఆయనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతుండటం పట్ల అసహనంతో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ వ్యూయర్స్ పై పడటంతో రేటింగ్స్ పడిపోయాయని ఆర్నాల్డ్ అంటున్నారు.
 
ఆర్నాల్డ్ హోస్ట్‌గా వ్యవహరించిన ఇటీవలి 'ద న్యూ సెలబ్రిటీ అప్రెంటిస్' షో కు కేవలం 5మిలియన్ల వ్యూయర్స్ నుంచి మాత్రమే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 'షో'కు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండటంతో పలు సంస్తలు కూడా స్పాన్సర్ చేసేందుకు వెనుకంజ వేస్తుందని.. తద్వారా రేటింగ్ పడిపోయిందని ఆర్నాల్డ్ ఫైర్ అవుతున్నారు.

ట్రంప్ అధ్యక్షుడై ఇంకా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలియడంతో చాలామంది ఈ షోను బహిష్కరిస్తున్నారని చెప్పాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ షోను చేయడంపై సందిగ్ధతలో ఉన్నట్లు ఆర్నాల్డ్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments