Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక.. నా పేరు మార్మోగిపోతుంది.. చూస్కో : ప్రేయసితో లూబిట్జ్

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (16:49 IST)
తనకు దూరమైన ప్రియురాలితో జర్మన్‌వింగ్స్ ఎయిర్‌బస్ ఏ320 కో పైలట్ ఆండియాస్ లూబిట్జ్... విమానాన్ని కూల్చి వేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తనకు దూరమైన ప్రియురాలితో.. తన పేరు మార్మోగిపోతుంది చూడు అంటూ ముందుగానే హెచ్చరించినట్టు సమాచారం.  
 
జర్మన్‌వింగ్స్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి గురిచేసిన కో పైలెట్ ఆండ్రియాస్ లూబిట్జ్‌కు సంబంధించి రోజుకొకటి ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తున్న విషయం తెల్సిందే. ఏదో ఒకనాడు తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుందని తన ప్రేయసితో చెప్పినట్టు తెలిసింది. లూబిట్జ్ ప్రేయసి మరియా ఈ విషయం తెలిపింది. 
 
ఎయిర్ హోస్టెస్ అయిన మరియా కొన్నాళ్లపాటు లూబిట్జ్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే, అతని మానసికస్థితి సరిగా లేకపోవడంతో ఆమె తమ అనుబంధానికి గుడ్ బై చెప్పింది. లూబిట్జ్ డిప్రెషన్‌లో కూరుకుపోయాడని, ఓ దశలో విపరీతంగా వ్యవహరించేవాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తాజాగా, విమానం కూలిపోయిన వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. దీంతో, లూబిట్జ్ అప్పట్లో అన్న మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయని వివరించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments