Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడికేం పోయేకాలం ద్యావుడా.. వండే కూరను బట్టి ఇల్లు ఇస్తానంటాడు.

బ్రిటన్‌లో ఒక సంపన్న ప్రబుద్ధుడు భారత, పాకిస్తాన్ జాతీయులకు చస్తే కూడా తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని కరాఖండీగా చెప్పేస్తున్నాడు. విషయం కోర్టుకు వెళ్లినా వెనక్కు తగ్గేది లేదని ఇతడు మొండికేశాడు.

Webdunia
గురువారం, 18 మే 2017 (03:59 IST)
ఇక్కడ కుక్కలకు, నల్లవాళ్లకు ప్రవేశం లేదు అనేది 150 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో కాని బ్రిటిష్ పాలిత ప్రాంత ప్రపంచంలో కానీ అలవాటుగా పాలకులు, పాలక జాతి ప్రజలు భారతీయులను అవమానపరుస్తూ చెప్పిన మాట. ప్రపంచంలో అలాంటి వివక్ష ఇప్పటికీ వివిధ రూపాల్లో అమలవుతోందని ఈ ఘటన తెలుపుతోంది. బ్రిటన్‌లో ఒక సంపన్న ప్రబుద్ధుడు భారత, పాకిస్తాన్ జాతీయులకు చస్తే కూడా తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని కరాఖండీగా చెప్పేస్తున్నాడు. విషయం కోర్టుకు వెళ్లినా  వెనక్కు తగ్గేది లేదని ఇతడు మొండికేశాడు. 
 
బ్రిటన్ సంపన్న గృహ పెట్టుబడిదారుడు ఫెర్గూన్ విల్సన్ వెయ్యి ఈగల్ని చంపిన వీరుడు కాదు కానీ వెయ్యికి పైగా ఇళ్లు ఉన్న సంపన్నుడు.  భారత్, పాకిస్తాన్‌ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని చెబుతున్నాడు. దీనిపై వివాదం రేగినా, న్యాయపర చర్యలు తీసుకునే అవకాశమున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు.
 
భారతీయులకు, పాకిస్తానీయులకు ఎందుకు ఇళ్లు ఇవ్వనంటున్నాడు అని ఆరా తీస్తే షాక్ కలిగే వ్యాఖ్య చేశాడు.  ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది..అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను. ఇది వారి శరీర వర్ణానికి సంబంధించిన సమస్య కాదు, కూర(కర్రీ)కు సంబంధించిన సమస్య..’ అనేశాడు.
 
అయితే  వెయ్యికిపైగా ఇళ్లున్న ఫెర్గూస్‌ భారతీయులపై విధించిన ఈ నిషేధాన్ని బ్రిటన్‌ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌(ఈహెచ్‌ఆర్‌సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్‌ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్‌ లండన్‌ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్‌రథ్‌ తెలిపారు. 
 
భారత్, పాక్‌ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్‌ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్‌ లీక్‌ కావడంతో వివాదం రేగింది.  
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments