Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బిల్లులకు మేం పన్నులు చెల్లించాలా? ఇక చాలు వెళ్లండంటున్న అమెరికన్లు

శ్రీనివాస్ కూచిభొట్ల దారుణ హత్యతో చల్లారని అమెరికన్ జాత్యహంకారం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (07:36 IST)
శ్రీనివాస్ కూచిభొట్ల దారుణ హత్యతో చల్లారని అమెరికన్ జాత్యహంకారం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డల్లస్ కౌంటీ పరిధిలోని ఇర్వింగ్ నగరంలో గల వాల్‌మార్ట్ దుకాణంలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాము కష్టపడి పనిచేసి పన్నులు కడుతుంటే విదేశీయులు తమ మీద పడి బతికేస్తున్నారని, ''మీ సొంత దేశానికి వెళ్లిపోండి'' అని అతగాడు అన్నాడు. 
 
వాల్‌మార్ట్ దుకాణంలో పనిచేసే ఆదెలా అనే మహిళ ఎల్ సాల్వెడార్ నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చారు, ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వాల్‌మార్ట్ దుకాణానికి వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెతో దురుసుగా మాట్లాడటమే కాక, తనకు సాయం చేయడానికి తెల్లజాతివారే కావాలని అడిగాడు. విషయం ఏమిటంటే.. వాల్ మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఆ శ్వేతజాతి కస్టమర్, తన కళ్లద్దాలతో ప్యాకెట్ల మీద ఉన్నవి సరిగా కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆదెలా ఆయనకు ఒక వైద్యుడిని కలవాల్సిందిగా సూచించారు. అయితే ఆమె సాయం తీసుకోవడానికి నిరాకరించిన అతడు.. తనకు తెల్లవాళ్లే కావాలని చెప్పాడు. దాంతో ఆదెలా మీరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అతడికి చెప్పడమే కాక, సూపర్‌వైజర్‌కు కూడా తెలియజేసినా, ఆయన కాన్ఫరెన్స్ కాల్‌లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. 
 
అంతలో అక్కడే ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌లో ఉన్న ఓ నల్లజాతి మహిళ గురించి కూడా ఆ శ్వేతజాతీయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఆమెను చూడండి, ఆమె ఆస్పత్రి బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు, నేనే.. అవును, నేను ఆమె బిల్లులు చెల్లిస్తున్నాను. ఆమె విదేశీయురాలు. ఇక్కడికి వచ్చింది. అనారోగ్యం పాలై బాగా లావెక్కింది. అందువల్ల ఆమె ఏమీ చేయలేదు, పని కూడా చేయలేదు. కానీ నేను ఆమె బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నేనేమైనా లావుగా ఉన్నానా నేను రోజూ పనికి వెళ్లి, పన్నులు చెల్లిస్తున్నాను. ఆ పన్నులతోనే ఆమెకు చికిత్స జరుగుతోంది'' అన్నాడు. 
 
అయితే, తాను కూడా ఉద్యోగం చేసి, పన్నులు చెల్లిస్తున్నానని ఆదెలా అతడికి సమాధానం ఇచ్చారు. కానీ అతడు అక్కడితో ఆగలేదు. ''తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తుంటే విదేశీయులంతా మామీద పడి బతికేస్తున్నారు. అవును. నేను నీకు నిజం చెబుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోతారని నాకు తెలుసు. కానీ మీరు మీ సొంత దేశాలకు వెళ్లిపోయి అక్కడ మీ దేశాలను బాగు చేసుకోండి'' అని వ్యాఖ్యానించాడు. 
 
ఆ తర్వాత సూపర్‌వైజర్ రావడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూపర్‌వైజర్‌కు ఆదెలా అతడి సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన వీడియో చూపించారు. తనకు ఏం చేయాలో తెలియలేదని, ఏడవాలో వద్దో కూడా అర్థం కాలేదని అన్నారు. ఆ శ్వేతజాతీయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని వాల్‌మార్ట్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు సూపర్‌వైజర్ చెప్పారు గానీ, అతడు అప్పటికే వెళ్లిపోయాడు. ఇలాంట జాతివివక్షను తాను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆదెలా వాపోయారు.
 
జాతి వివక్ష కాదు ఉన్మాది మానసిక వైపరీత్యమే శ్రీనివాస్ హత్యకు దారితీసిందని వివక్షను తక్కువ చేసి చూపుతున్నవారు అమెరికాలో నేటికీ విస్తరిస్తున్న ఇలాంటి ఘటనలు ఏ ఉన్మాందంలో భాగమో చెప్పగలరా?
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments