Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస్ మృతిపై కేటీఆర్ స్పందన... కేంద్రంతో చర్చిస్తా.. బిడ్డలు లేరు.. ఏం సమాధానం చెప్పాలి..?

అమెరికాలో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల, తీవ్రగాయాలపాలైన అలోక్ రెడ్డి కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇటీవల వరంగల్‌కు చెందిన వ

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (13:22 IST)
అమెరికాలో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల, తీవ్రగాయాలపాలైన అలోక్ రెడ్డి కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇటీవల వరంగల్‌కు చెందిన వంశీ, రెండు రోజుల క్రితం శ్రీనివాస్ అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించడం బాధాకరమైన విషయమని కేటీఆర్ అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ఎన్నారైలపై దాడులపై భారత విదేశాంగశాఖతో కలిసి చర్చిస్తామని తెలిపారు.
 
కన్సాస్ రాష్ట్రంలో ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో జాతి విద్వేషంతో ఓ అమెరికన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా, అలోక్ తీవ్రగాయాలపాలయ్యారు. గత 15రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. ఫిబ్రవరి 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఘటనలపై అమెరికాలోని భారత ఎంపీలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. 'కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను బాధపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్ మహిళ పరిమళ జయపాల్ వెల్లడించారు.
 
మరోవైపు శ్రీనివాస్ భార్య మీడియాతో అమెరికా సర్కారును నిలదీశారు. శ్రీనివాస్ తల్లికి తాను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాకు బిడ్డలు కూడా లేరని.. శ్రీనివాస్ జ్ఞాపకాలే తనకు మిగిలాయని చెప్పారు. మంచి వాళ్లకు మంచి జరుగుతుందనీ, భయపడొద్దనీ శ్రీనివాస్ ఎప్పుడు చెప్పేవారని ఆమె మీడియాతో చెప్పారు. ఎక్కడ కాల్పులు జరిగాయని పత్రికల్లో చదివినా తాము భయపడేవారిమని... ఈ ఘోరంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు శ్రీనివాస్‌ భార్య సునయన. ఇంకో రెండు వారాల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా.. ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments