Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాలి లేని భర్త కంటే కుక్కే బెటర్... పెంపుడు శునకం కోసం భర్తకు విడాకులు

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (16:40 IST)
జాలిలేని భర్త కంటే కుక్కే బెటర్ అని ఓ మహిళ భావించింది. అందుకే తన పెంపుడు శునకం కోసం ఏకంగా కట్టుకున్న భర్తనే వదిలివేసింది. ఈ సంఘటన ఇంగ్లండ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్‌లోని బ్రన్హమ్‌కు చెందిన లిజ్‌ అనే యువతికి చిరుప్రాయం నుంచి పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రాణం. తన బాల్యాన్ని కుక్కల మధ్యే గడిపింది. ఆమెకు 16 యేళ్ళ వయసులో మైక్‌ హస్లమ్‌ అనే యువకుడి ప్రేమలో పడింది. అతని కోసం తన తల్లిదండ్రులను కూడా లిజ్ వదిలిపెట్టింది. 
 
ఈ క్రమంలో 1991లో మైక్‌ను పెళ్లి చేసుకున్న లిజ్... బ్రన్హమ్‌లో వేరు కాపురం పెట్టారు. ఆ తర్వాత లిజ్‌ కుక్క పిల్లల వ్యాపారం మొదలు పెట్టింది. ప్రస్తుతం వీరికి 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తొలి రోజుల్లో ఒకటి రెండు కుక్కల్ని పెంచుతూ వచ్చింది. దీంతో భర్త మైక్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కాలక్రమంలో ఇంట్లో కుక్కల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం ఏకంగా 30 కుక్కలు ఉన్నాయి. దీంతో మైక్‌లో అసహనంతో ఆగ్రహం కూడా పెరిగింది. 
 
దీన్ని తట్టుకోలేక పోయిన మైక్‌ ఓ రోజు నేను కావాలో, కుక్కలు కావాలో తేల్చుకోవాలని భార్యకు అల్టిమేటమ్‌ ఇచ్చాడు. భర్త మాటలతో తీవ్రంగా నొచ్చుకున్న లిజ్... .మరో మాటకు తావివ్వకుండా 'నాకు కుక్కలే కావాలి. కావాలంటే నీవు బ్యాగు సర్దుకుని బయటకు పో' అని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక మైక్‌ బ్యాగు సర్దుకుని బయటకు వెళ్లిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments