Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్ నగరాన్ని ఖాళీ చేయకుంటే చచ్చిపోతారట...

టెక్సాస్ నగరాన్ని తక్షణం ఖాళీ చేయకుంటే అక్కడ నివశించేవారు చనిపోతారని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు టెక్సాస్ వాసులకు ప్రభుత్వ అధికారు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (08:51 IST)
టెక్సాస్ నగరాన్ని తక్షణం ఖాళీ చేయకుంటే అక్కడ నివశించేవారు చనిపోతారని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు టెక్సాస్ వాసులకు ప్రభుత్వ అధికారులు "వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 
 
గతవారం రోజులుగా తూర్పు టెక్సాస్‌‍పై హార్వే హరికేన్ విరుచుకుపడి, కకావికలం చేస్తున్న విషయం తెల్సిందే. వారంరోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో హూస్టన్‌ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరింది.
 
టేలర్‌ కౌంటీలోని నిషెస్‌, స్టీన్‌ హేగెన్‌ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఊళ్లను ముంచెత్తనుంది. దీంతో తక్షణం ఆ ఊళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. లేనిపక్షంలో ఆ ప్రాంత వాసులు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు. 
 
అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వెయ్యేళ్లకోసారి ఇలాంటి వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, ఇప్పటివరకు టెక్సాస్‌లో 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిగా, 48,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments