Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాల్లాగే కోరలు.. చిరుతల్లాంటి వేగం.. వేటాడే పాములు.. !!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (10:30 IST)
సింహాల్లాగే కోరలు,, చిరుతపులికున్న వేగం.. జంతువు కనిపిస్తే వేటాడి నలిమి మింగే పాములు.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమని పరిశోధకులు చెబుతున్నారు. క్రూర జంతువులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు వాటికి ఉండేవని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాలక్రమేణ మార్పుల కారణంగా పాములు పాకేవిగా మారిపోయాయని అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
పాముల పూర్వీక జాతికి కాళ్లుండేవట. ఇవి కూడా జంతువుల మాదిరి వేటాడేవట. ఈ వేటాడే పాముల నుంచి ఇప్పుడున్న దాదాపు 3 వేలకు పైగా పాము జాతులు ఉద్భవించాయని తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. అవి వాటికున్న హుక్‌లాంటి పళ్లను ఉపయోగించి వేటాడేవని చెబుతున్నారు.
 
వీటికి వెనుక కాళ్లకు బొటనవేలు, మడమలు ఉండేవని, కాకపోతే అవి కదిలేందుకు సహకరించి ఉండకపోవచ్చని అంటున్నారు. దాదాపు 73 సర్ప జాతుల శిలాజాలు, జన్యు క్రమం, శరీర నిర్మాణాలను పోల్చి చూశాక యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాదాపు 12.85 కోట్ల సంవత్సరాల కింద ఈ పాము జాతులే రాజ్యమేలాయిని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments