Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ కార్గో విమానచక్రాలల్లో మానవ శరీర భాగాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:16 IST)
తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఆ దేశం నుంచి ప్రజలు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, విమానాశ్ర‌యం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికద‌ళ కార్గో విమానంపై ఎక్కేందుకు జ‌నం ఎగ‌బడ్డారు. 
 
తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రుగులు తీస్తున్న విమానాన్ని ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారు. ట‌ర్మాక్‌పై కూర్చుకున్న కొంద‌రు విమానం గాల్లోకి ఎగిగిర త‌ర్వాత కింద ప‌డ్డారు. ఆ దృశ్యాలు అంద‌ర్నీ క‌లిచివేశాయి. 
 
అయితే సీ-17 గ్లోబ్‌మాస్ట‌ర్ సైనిక విమానంపై ఎక్కిన కొంద‌రు దాన్ని వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందితో వెళ్లిన ఆ విమానం ఖ‌తార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. కానీ ఆ విమానం అక్క‌డ దిగిన త‌ర్వాత వైమానిక ద‌ళ స‌భ్యుల‌కు మ‌రో షాక్ త‌గిలింది. విమాన చ‌క్రం (వీల్) భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు, అవ‌య‌వాలు క‌నిపించిన‌ట్లు వైమానిక ద‌ళం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
 
స‌రుకుల‌తో వ‌చ్చిన త‌మ విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్ష‌ణాల్లోనే వంద‌లాది మంది వ‌చ్చి ఎలా దాన్ని ఆక్ర‌మించారో తెలియ‌ద‌ని అమెరికా త‌న‌ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. గ్లోబ్‌మాస్ట‌ర్ సైనిక విమానం స‌రుకును దించ‌క‌ముందే.. ఆ విమానాన్ని వంద‌లాది మంది చుట్టుముట్టిన‌ట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ప‌రిస్థితి అదుపుత‌ప్పుతున్న‌ట్లు తేలడంతో త‌క్ష‌ణ‌మే సీ-17 విమానాన్ని అక్క‌డ నుంచి త‌ర‌లించిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. కాబూల్ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు అమెరికా వైమానిక ద‌ళం చెప్పింది. విమానాశ్ర‌యం వ‌ద్ద ఏర్ప‌డ్డ గంద‌ర‌గోళంలో ప‌లువురు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ఎంత మంది మృతిచెందార‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments