Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెబనాన్‌ లో మృత్యుహేల.. భారీ పేలుడుతో.. 80 మంది మృతి.. 4 వేలమందికి గాయాలు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (08:58 IST)
భారీ పేలుడు లెబనాన్ ను వణికించింది. మృత్యువు వికటాట్టహాసం చేసింది. మంగళవారం సాయంత్రం లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించి సుమారు 80 మంది చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.

పోర్టు ఏరియాలో అమోనియం నైట్రేట్‌ను నిల్వ ఉంచిన గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. దాదాపు కిలోమీటర్‌కు పైగా ఈ భారీ పేలుడు వ్యాపించినట్టు తెలుస్తోంది.

మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులో వుందని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments