Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రేమను పరీక్షించాలని భర్త ఏమి చేసాడో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:09 IST)
సాధారణంగా ప్రేయసిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో హీరో నిల్చున్న దృశ్యాలను మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ సన్నివేశం ఇప్పుడు నిజజీవితంలోనూ జరిగింది. చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే ఓ వ్యక్తి తాగిన మత్తులో ఈ పని చేసాడు. భార్యతో గొడవపడి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. 
 
పీకలదాకా మద్యం తాగి భార్యకు ఫోన్ చేసాడు. ఆ తర్వాత ఇద్దరూ రోడ్డుపైనే కాసేపు తిట్టుకున్న తర్వాత పాన్ వెళ్లి బిజీ రోడ్డు మధ్యలో నిలబడ్డాడు. భార్య అతడిని ఎంత లాగడానికి ప్రయత్నించినా.. మొండిగా అక్కడే నిలబడ్డాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాన్ తలకు, ఛాతికి తీవ్రగాయాలయ్యాయి. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. 
 
భార్యకు తనపై ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని ఇలా చేసానని, చివరకి ఇలా జరిగిందని ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పాన్ వాపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments