Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో అగ్నిప్రమాదం - 21 మంది సజీవ దహనం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (11:49 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవదహనమయ్యారు. వేగంగా వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి 21 మంది అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోర్ జిల్లా నూరియాబాద్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. 
 
సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోర్ జిల్లా నూరియాబాద్ ఏం-9 మోటార్ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైపోయింది. కిటికీలు మూసి ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు కాలి కొందరు చనిపోగా, దట్టమైన ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments