Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా హస్బ్... నా ప్రత్యర్థి' మాట్లాడుతున్న దానికి కౌంటర్ ఇస్తున్నా.. పోల్చి చూడండి : హిల్లరీ క్లింటన్

ఎంతటి ఘనాపాటీయులకైనా ఏదో ఒక సందర్భంలో టంగ్ స్లిప్ కావాల్సిందే. ఆ తర్వాత తెలుసుకుని నాలుక్కరుచుకోవడం పరిపాటి. అలాంటి పరిస్థితే అమెరికా అధ్యక్ష పీఠం కోసం తలపడుతున్న హిల్లరీ క్లింటన్‌కు ఏర్పడింది.

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (15:34 IST)
ఎంతటి ఘనాపాటీయులకైనా ఏదో ఒక సందర్భంలో టంగ్ స్లిప్ కావాల్సిందే. ఆ తర్వాత తెలుసుకుని నాలుక్కరుచుకోవడం పరిపాటి. అలాంటి పరిస్థితే అమెరికా అధ్యక్ష పీఠం కోసం తలపడుతున్న హిల్లరీ క్లింటన్‌కు ఏర్పడింది. 
 
నిజానికి అధ్యక్ష పీఠం కోసం హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్‌లు తలపడుతున్నారు. దీంతో వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ పార్టీల తరపున అభ్యర్థులుగా ఖరారు కాకముందే వీరిద్దరూ పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అధికారిక అభ్యర్థులుగా ఖరారైన తర్వాత వారు తమ మాటల దాడులను మరింతగా పెంచారు. 
 
ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన నల్లజాతి, హిస్పానిక్ పాత్రికేయుల జాతీయ సంఘాల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా హిల్లరీ నాలిక స్లిప్పయ్యింది. 'నా హస్బ్... నా ప్రత్యర్థి మాట్లాడుతున్న దాని గురించి నేను చెప్పేదాన్ని పోల్చి చూస్తారని ఆశిస్తున్నాను' అని హిల్లరీ పేర్కొన్నారు. ఈ వాక్యంలోని 'హస్బ్' అన్న పదం వినగానే సభికులు గొల్లుమనగా, హిల్లరీ వెంటనే సర్దుకున్నారు. 
 
హిల్లరీ చేసిన ఓ కామెంట్... ఆమె ప్రసంగాన్ని వింటున్న వారినే కాకుండా నెటిజన్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్‌ను తన ప్రత్యర్థిగా అభివర్ణించేందుకు బదులుగా హిల్లరీ... ఆయనను తన భర్తగా చెప్పింది. అయితే క్షణకాలంలో తాను చేసిన పొరపాటును గుర్తించిన ఆమె వెనువెంటనే సర్దుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments